రోజు ఉదయం 5లేక 6 కిస్మిస్ లు నీటి లో మరిగించి ఆ నీటిని తాగడం కళ్ళకి మంచిది
పాల లో కాని కలబంద రసంలో కానీ దూది ని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది
గంధం చేక ని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుంది
నిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు ,నాలుగైదు నువ్వుల నూనె చుక్కలు కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా ,స్వచ్ఛ గా ఉంటాయి
Also Read:Chinajeeyar: శ్రీరాముడే నిజమైన బాహుబలి
కళ్ళు మంటగా వుంటే చల్లని నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ము కణాలు , మలినాలను తీసివేయడంలో సహాయపడుతుంది.
దూది ని రోజ్ వాటర్ లో ముంచి కనురెప్పుల పైన10-15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటి గాయాలకి కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుంది.
దోసకాయ ముక్కల్ని కట్ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుండి ఉపశమనం పొందవచ్చు.
Also Read:CMKCR:వలసల కాలం పోయి పంటల కాలం వచ్చింది
దూది ని పాల లో ముంచి కంటి చుట్టు తుడవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం గా కడుక్కొవాలి.
పచ్చి బంగాళ దుంప గుండ్రటి ముక్కలను కళ్ళ పై పెట్టు కుంటే కళ్ళ మంటల నుండి ఉపశమనం లభిస్తుంది.