ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌కి రాం రాం!

14
- Advertisement -

జబర్దస్త్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బూతులతో కొన్ని సార్లు పరిధి దాటినా.. ఎందర్నో నవ్వులతో ముంచెత్తింది ఈ షో. పైగా ఈ షో ద్వారా ఎందరో ఇండస్ట్రీకి పరిచయం కాగా ఇప్పుడు హీరోలుగా కూడా చేస్తున్నారు. ఇక జబర్దస్త్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ని ప్రారంభించగా యాంకర్లుగా అనసూయ, రష్మి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక్కొక్కరుగా నటులు జబర్దస్త్‌ని వీడగా యాంకర్ అనసూయ సైతం గుడ్ బై చెప్పేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈ షోకే రాం రాం చెప్పే పరిస్థితి వచ్చింది.

ఇటీవల జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న ఇంద్రజ మానేస్తున్నాను అని చెప్పగా తాజాగా రష్మీ మరో బాంబు పేల్చేసింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోని పూర్తిగా తీస్తున్నట్టు యాంకర్ రష్మి తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం గురు, శుక్ర వారాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వస్తున్నాయి. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు తాజా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ తెలిపింది. ఇకపై జబర్దస్త్ కి కృష్ణ భగవాన్, కుష్బూలు జడ్జీలుగా ఉంటారని తెలుస్తుంది. అలాగే యాంకర్ సిరి హనుమంత్ ని కూడా తప్పించి రెండు ఎపిసోడ్స్ కి రష్మీనే యాంకర్ ని చేస్తారని సమాచారం.

Also Read:NKR21లో రాములమ్మ!

- Advertisement -