అందరి కళ్లు..ఎగ్జిట్ పోల్స్‌ పైనే..!

320
exit polls
- Advertisement -

మే 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మే 19 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక మే 19న ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించేందుకు పలు సంస్థలు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో పొలిటికల్ పార్టీలే కాదు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో విజయం ఎవరిని వరించనుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేంద్రంలో ఎవరూ అధికారాన్ని చేపట్టబోతున్నారు..?ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి వస్తాయా..? ఏఏ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హావా ఉండనుంది..? యూపీ,బెంగాల్‌,తమిళనాడు,కర్నాటక,రాజస్థాన్,మధ్యప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాల్లో ఎవరు పైచేయి సాధిస్తారు..?ఏపీలో అధికారం ఎవరిని వరించనుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే గతంలో అనేక సర్వేల్లో వచ్చిన రిపోర్టు కాస్తా అటు ఇటుగా నిజమైన సందర్భాలే ఎక్కువ. మరోవైపు అభ్యర్థుల గెలుపొటములు,ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానిపై బెట్టింగ్‌లు జోరందుకోవడంతో ఎలక్షన్‌ హీట్ తారాస్థాయికి చేరింది.ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు,ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలో ప్రజలు ఎవరి ఉన్నారో తెలియనుండటంతో సర్వత్రా ఉత్కంఠనెలకొంది.

- Advertisement -