5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసేనని వెల్లడించాయి. బీఆర్‌ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ వెల్లడించింది. 43 శాతం మంది ఓటర్లు బీఆర్‌ఎస్ వెంట ఉన్నారని తెలిపింది.
26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని సీపీఎస్ వెల్లడించింది. 11 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని తెలిపింది. దాదాపు 29 నియోజకవర్గాల్లో 3000 కంటే తక్కువ మెజారిటీతోనే బీఆర్‌ఎస్ గెలుస్తుందని పేర్కొంది.
బీఆర్ఎస్ పార్టీ 68కి పైగా సీట్లలో గెలవబోతుందని పొలిటికల్ గ్రాఫ్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 5, ఇతరులు 8 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ 61 -68 స్థానాల్లో గెలుస్తుందని థర్డ్ విజన్ నాగన్న ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ 34-40, బీజేపీ 3-5, ఇతరులు 5-8 స్థానాల్లో గెలవబోతున్నారని పేర్కొంది. థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్‌ఎస్ 60-68 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ 33-40, బీజేపీ 1-4 స్థానాల్లో, ఇతరులు 0-1 శాతం గెలుస్తుందని పేర్కొంది.
Also Read:ప్చ్.. యానిమల్ పరిస్థితేమిటి?