ఎగ్జిట్ పోల్స్‌.. ఏపీలో అధికారం ఎవరిదంటే..!

191
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా టుడే వెల్లడించింది. ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది. అయితే సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం.. టీడీపీకి 14, వైసీపీకి 11 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్-18 సర్వే ప్రకారం టీడీపీకి 10-12, వైసీపీకి 13-14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది.

Andhra Pradesh

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని సీపీఎస్‌ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది.

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్‌ వెల్లడించింది. ఇక మే 23న అధికారికంగా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.