- Advertisement -
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. దోషుల ఉరిశిక్షపై న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నది. అందువల్లే రేపటి ఉరిశిక్ష వాయిదా పడినట్లు కోర్టు తెలిపింది. రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది.
ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా ఆదేశాలు జారీ చేశారు. కాగా నిర్భయ ఉరిశిక్ష వాయిదా పడడం మూడోసారి. ఇక నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడే వరకు న్యాయం కోసం పోరాడుతానని చెప్పింది నిర్భయ తల్లి.
- Advertisement -