- Advertisement -
సర్జరీ విఫలమై మాజీ మిస్ బ్రెజిల్ గ్లెయిసీ కొరియా మృతిచెందింది. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకున్న గ్లెయిసీ..ఇటీవలె ట్రాన్సిల్స్ సర్జరీ చేయించుకుంది.
అయితే అది విఫలం కావడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో మెదడులో రక్తం గడ్డకట్టిపోగా ఆస్పత్రిలో చేరారు. అయితే సోమవారం పరిస్థితి విషమించడంతో మృతిచెందింది.
ఆమె మృతితో కుటుంబంలో తీవ్ర విషాదచాయలు నెలకొన్నాయి. గ్లెయిసీ లేకుండా తాము తమ జీవితాలను కొనసాగించడం కష్టమని…తన నవ్వే తమకు గుర్తొస్తుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.
- Advertisement -