- Advertisement -
మాజీ మంత్రి మాదాటి నరసింహారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. నరసింహరెడ్డి భూపాలపల్లి జిల్లా , మొగుళ్లపల్లి మండలం మొసలపల్లి గ్రామంలో జన్మించారు. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
ఆయన మృతి పట్ల కరీంగనర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
- Advertisement -