లక్ష్మారెడ్డి సతీమణి మృతి.. హరీశ్‌ రావు నివాళి

9
- Advertisement -

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డికి నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సోమవారం అర్ధరాత్రి శ్వేతా రెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శ్వేతా రెడ్డి. చెన్నైలో వైద్యం తీసుకుంటూ కోలుకోలేక మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని మంగళవారం రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి నేరుగా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి తీసుకురాగా మాజీ మంత్రి హరీష్ రావు అవంచకు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ డీకే అరుణ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీహరి, మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ,వంశీకృష్ణ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ ఎంపీ రాములు తదితరులు ఉన్నారు.

మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మెహన్ రెడ్డి, సురేందర్, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రజిని, ఇంతియాజ్, ఇతర నాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.

Also Read:బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

- Advertisement -