సీఎం తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి..

134
- Advertisement -

ముఖ్యమంత్రి జగన్‌ ప్రమేయంతోనే సరుగుడులో లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను దోచుకుంటున్నారని సీఎం తీరును విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోంది. రోజూ వందలాది లారీల్లో భారతి సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తుంటే పోలీస్, అటవీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రిజర్వ్ ఫారెస్టులో 10 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే, అటవీ శాఖ ఎలా పర్మిషన్ ఇచ్చింది అన్నారు.

ప్రభుత్వ అండతో విచ్ఛలవిడిగా రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వేగన్ ద్వారా వేల టన్నులు బాక్సైట్‌ ఎగుమతి చేస్తున్నా, రెండు జిల్లాల అధికారులు పట్టనట్టు వ్యవహరించడం దారుణం మండిపడ్డారు. ప్రజల సౌకర్యార్ధం రోడ్డు వేశానని అటవీ అధికారులు చెబుతున్నా, వాటిపై ఎటువంటి రుసుం చెల్లించకుండా భారీ వాహనాలకు ఎలా అనుమతి ఇస్తున్నారు? విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఇంత దోపిడీ జరుగుతుంటే నర్సీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఖండించడం లేదు…దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి అయ్యన్న ధ్వజమెత్తారు.

- Advertisement -