2017 సివిల్స్ ఫలితాల్లో తెలుగువాళ్లు సత్తా చాటారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అనుదీప్ సివిల్స్ టాపర్‌గా నిలవగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు లక్ష్మీనారాయణ. నీతి,నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తాడని ఆశిస్తున్నానని తెలిపారు. సేవా ధృక్పథంతో పని చేయాలని ప్రణీత్‌కు సూచిస్తున్నానని తెలిపారు. సివిల్స్ ర్యాంకులు సాధించిన మిగిలిన అభ్యర్థులకు కూడా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
సాయి ప్రణీత్ ఏడవ తరగతి వరకు మహారాష్ట్రలో… అక్కడి నుంచి టెన్త్ వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతి విద్యాభవన్‌లో చదివారు. రాజస్థాన్‌లోని బిట్స్‌పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తర్వాత సివిల్స్‌కు సిద్ధమై… తొలి ప్రయత్నంలోనే 196వ ర్యాంక్ సాధించారు. తన తండ్రి గైడెన్స్, కృషి వల్లే సివిల్స్‌లో విజయం సాధించాని సాయి ప్రణీత్ తెలిపారు. తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.
తొలి ప్రయత్నంలోనే సాయి ప్రణీత్ ర్యాంకు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్‌తో కేక్ కట్ చేయించిన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో సివిల్స్ పరీక్షలు నిర్వహించారు. అనుదీప్,సాయి ప్రణీత్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తా చాటారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు),నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), భార్గవ శేఖర్ (816వ ర్యాంకు) సాధించారు.