- Advertisement -
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు జీవిత ఖైదు విధించింది ఢిల్లీ తీస్ హజారీ కోర్టు. 2017 నాటి ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తీస్ హజారీ కోర్టు ఈనెల 16న కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. అనంతరం దోషికి జీవిత ఖైదు శిక్షను ఈరోజు ఖరారు చేసింది.
ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అందులో 10 లక్షలు బాధితురాలికి, 15 లక్షలు విచారణ సంబంధించిన ఖర్చులకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో బాధితురాలికి ప్రాణభయం ఉంటే ఆమెకు రక్షణ కల్పించాలని, బాధితురాలు, ఆమె కుటుంబం ఉండడానికి సురక్షితమైన నివాసం ఏర్పాటు చేయాలని సీబీఐని తీస్ హజారీ కోర్టు ఆదేశించింది.
- Advertisement -