ఏపీలో రూ. 1300 కోట్లతో eVTOL హబ్

10
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నమైన eVTOL (ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) హబ్‌ను ఏర్పాటు చేయడానికి సర్ల ఏవియేషన్ (Sarla Aviation) సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరింది.

ఈ హబ్‌ను దాదాపు రూ. 1,300 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి eVTOL హబ్ కావడం విశేషం.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ, ఆధునిక ఏవియేషన్ రంగంలో కీలక స్థానాన్ని సంపాదించుకోనుంది. 2029 నాటికి ఎయిర్-టాక్సీ కారిడార్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ హబ్ ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రిక్ విమానాల తయారీ మరియు నిర్వహణ జరగనుంది. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడటంతో పాటు, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

సర్ల ఏవియేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఏపీని ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read:TTD:ఫిబ్రవరి దర్శన కోటా రిలీజ్

- Advertisement -