ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు

258
Every second child in Maharashtra, Madhya Pradesh, Gujarat victim of sexual abuseq
Every second child in Maharashtra, Madhya Pradesh, Gujarat victim of sexual abuse
- Advertisement -

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. కల్మషం లేని హృదయాలు వారి సొంతం. అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వారి అందమైన బాల్యం, నవ్వుల పువ్వులు పూయాల్సిన వారి ముఖాలు ఏడుపుతో, చెప్పుకోలేని బాధ‌తో క‌న‌ప‌డుతున్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప‌సివారి పరిస్థితి మ‌రీ దారుణంగా మారింది. ‘ప్లాన్‌ ఇండియా’ అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో స‌భ్య‌స‌మాజం త‌లదించుకునే ప‌లు విషయాలు వెలుగు చూశాయి. నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటే మాన‌వ‌త్వం ఎటుపోతోంది? అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది.

ca0

ప్లాన్‌ ఇండియా అనే ఒక ఎన్జీవో ‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు’పేరిట ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అదృశ్యమైన చిన్నారుల్లో 48 శాతం మంది ఆచూకీ లభించడంలేదు.

Every second child

20–24 ఏళ్ల మహిళలను సర్వే చేయగా వారిలో 57.6 శాతం మంది వివాహాలు 18 ఏళ్ల కంటే ముందే జరిగాయి. రాజస్థాన్‌లో బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 43 లక్షల మంది బాలకార్మికుల్లో అత్యధిక సంఖ్యలో 18 లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారు.

- Advertisement -