ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!

22
- Advertisement -

నేటి రోజుల్లో సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మొబైల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్ ద్వారా జరుగుతుండడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొబైల్ ను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటాను దొంగిలించడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి అక్రమాలకు పాల్పడడం, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ ద్వారా బాధింపబడడం.. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి సమస్య పరిష్కారానికి పోలీస్ స్టేషన్ వెళ్లలేక కొంతమంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఉన్నచోట నుంచి మనం ఎదుర్కొనే ఎలాంటి సమస్యనైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళేందుకు గవర్నమెంట్ కొన్ని పోన్ నెంబర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి గురించి తెలుసుకుందాం !

ప్రస్తుత రోజుల్లో స్పామ్ కాల్స్ నుంచి బాధింపబడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ వేధింపులకు పాల్పడుతుండడం… ఇలా ఎవరైనా ఫోన్ చేసి వేధిస్తుంటే వెంటనే 1930 అనే నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ లోనే వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు.

ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానిలో నాణ్యత పరమైన లోపాలు కనిపించిన లేదా ఆ వస్తువు పై ఏమైనా సందేహాలు ఉన్నా లేదా కట్టిన డబ్బుకు సరిపడా వస్తువులు ఇవ్వకపోయినా, ఫలానా వస్తువు కారణంగా మీరు నష్టపోయిన.. కంజ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ 1951 కు కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.

ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతూ వేధించడం గాని లేదా మీ పనిని ఆలస్యం చేసినగాని 1064 నెంబర్ కు కాల్ చేసి వారిపై కేసు నమోదు చేయవచ్చు.

ఎవరైనా రోడ్ పై యాక్సిడెంట్ కు గురైనప్పుడు దగ్గరలో ఎలాంటి హస్పేటల్ లేనప్పుడు వెంటనే 1033 కి కాల్ చేసి వారిని కాపాడవచ్చు.కాబట్టి పై నెంబర్స్ కచ్చితంగా ప్రతిఒక్కరి మొబైల్ లో ఉండటం చాలా మంచిది.

Also Read:మహిళల్లో హార్మోనల్ ఎఫెక్ట్… జాగ్రత్త!

- Advertisement -