- Advertisement -
ఎవరెస్ట్ ఫుడ్ మసాలపై నిషేధం విధించింది సింగపూర్ ప్రభుత్వం. మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు నిషేధం విధించిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలపై ఎవరెస్ట్ ఫుడ్స్ స్పందించింది. తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించలేదని…సింగపూర్‌లో 1 ఉత్పత్తిని రీకాల్ చేశారని పేర్కొంది. ఎవరెస్ట్ ఉత్పత్తులను ఏ దేశంలోనూ నిషేధించలేదని..రీకాల్ చేసిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని తమ సింగపూర్ దిగుమతిదారుని ఆ దేశ ప్రభుత్వం కోరిందన్నారు.
తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, అధిక నాణ్యత కలిగినవని హామీ ఇచ్చింది ఎవరెస్ట్ కంపెనీ. భారతీయ మసాలా దినుసుల బ్రాండ్లకు విదేశాల్లో రీకాల్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.
Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..
- Advertisement -