Gunasekhar:యుఫోరియాలో కాల భైరవ

12
- Advertisement -

కాల భైర‌వ‌.. భార‌త‌దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపారు. ఆయ‌న‌ ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని టీమ్ తెలియ‌జేసింది.

Also Read:డిప్యూటీ సీఎంగా పవన్‌!

- Advertisement -