రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటారు నటుడు ETV ప్రభాకర్. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టడమే కాకుండా నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగడం గొప్ప విషయం అన్నారు.
సంతోష్ కుమార్ గారిని సంకల్పం లో భాగంగా ప్రతీ పుట్టినరోజు మొక్కలు నాటుతున్నాను అన్నారు. రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. kCR గారు కూడా రాష్టం అంతా పచ్చగా ఉండాలని హరిత తెలంగాణ గా తీర్చి దిద్దడం చాలా ఆనందంగా ఉంది అని తెలంగాణ ప్రజలు అందరు KCR గారి పాలనలో ఆనందంగా ఉన్నారని, KCR గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడం చాలా మంచి పరిణామం అని దేశం అంతా KCR గారి పాలన అవసరం అన్నారు. ఇంతటి మహా యజ్ఞం లో నన్ను భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.