తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలైన ఈటల రాజేందర్ మరియు బండి సంజయ్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇటీవల ఇరువురు నేతలు మతం మరియు రాజకీయాల విషయంలో పరోక్షంగా విమర్శలు చేసుకున్న నేపథ్యంలో, కరీంనగర్‌లో బండి సంజయ్ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరింత రాజకీయ వేడిని పెంచాయి.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలలో ఎంపీ ఈటల రాజేందర్ ఫోటోను పూర్తిగా తొలగించారు. ఇది ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరిందనడానికి నిదర్శనం.
ఇటీవల, ఈటల రాజేందర్ మాట్లాడుతూ…తెలంగాణలో మత రాజకీయాలు పనికి రావు అని పరోక్షంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇస్తూ బండి సంజయ్, “మనకు మన మతం, సంప్రదాయం, సనాతన ధర్మమే బలం అని వ్యాఖ్యానించారు. ఇద్దరు కీలక నేతల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం వరకు చేరడంతో, తెలంగాణ బీజేపీలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read:సత్యసాయి శత జయంతి వేడుకల్లో మోదీ

