ఇక గాంధీలోనే కరోనా టెస్టులు- మంత్రి ఈటెల

535
Minister Etela Rajender
- Advertisement -

ఇవాళ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన లేజర్ వింగ్ వార్డ్, మెడికల్ కాలేజ్ లోని అకాడమిక్ బిల్డింగ్ లైబ్రరీని ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్. అనంతరం ఆయన వైరాలజీ లాబ్‌ను పరిశీలించి కరోనా టెస్ట్‌లు ఎలా నిర్వహిస్తారు అని వైద్యలును అడిగి తెలుసుకున్నారు.

minister etela

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతున్నారు. మన రాష్ట్రంలో ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా టెస్టుల కోసం గత 10 రోజులుగా రోగులను పుణెకు పంపుతున్నాం. కానీ ఇప్పుడు గాంధీలోనే టెస్టులు ప్రారంభించాం. గంటల్లోనే రిజల్ట్ వస్తుంది. వీటికి సంబంధించి కేంద్రం కిట్స్ పంపిందన్నారు.

 

టెస్టుల కోసం లాబ్‌లో కిట్స్,, మాన్ పవర్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఫీవర్, చెస్ట్, గాంధీలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు .ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక కరోనా కేస్ నమోదు లేదు. దీనిపై వైద్యులు 24 గంటలు అందుబాటులో వున్నారు. అంతేకాదు గాంధీలో డెర్మటాలజి లో న్యూ టెక్నాలజీ ప్రారంభించాం. అలాగే పిల్లల్లో వినికిడి సమస్యల పరిష్కారం కోసం కొత్త టెక్నాలజీ ప్రారంభం చేయడం జరిగిందన్నారు మంత్రి.

etela rajendar

ఇక క్యాన్సర్ హాస్పిటల్లో.. పెట్ స్కాన్ ను ప్రారంభిస్తున్నాం. ఉస్మానియా, కోటి మెటర్నిటీ హాస్పిటల్స్ లో కొత్త విభాగాలు ప్రారంభమైయ్యాయి. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. చైనా నుంచి వచ్చిన వారికి 14 రోజులు అబెజర్వేషన్‌లో ఉంచి కేంద్రం స్క్రీనింగ్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్‌కు సంబంధించిన టెస్టులు ఇక్కడే చేస్తామన్నారు మంత్రి ఈటెల.

- Advertisement -