ఛీఛీ..గ్యాస్ బండపై ఇన్ని పచ్చి అబద్ధాలా..ఈటల..!

94

ఆర్నెళ్లు సహవాసం చేస్తే వారు వీరు అవుతారన్నట్లు బీజేపీ నేతల అబద్ధపు ప్రచారాల కళ హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అబ్బినట్లు ఉంది…అందుకే ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలను ప్రజలను మభ్యపెట్టే పడేసే పనిలో పడ్డారు. అవును.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెలంగాణలో పెన్షన్లతో సహా అన్ని సంక్షేమ పథకాలు కేంద్రమే ఇస్తుందంటూ బండి సంజయ్, అర్వింద్, రఘునందన్‌రావు వంటి నేతలు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను బుట్టలో పడేసి ఓట్లు కొల్లగొట్టారు. అబద్ధపు ప్రచారాలతో కాషాయ నేతలు గోబెల్‌ను మంచిపోయారు. . ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా కాషాయ నేతల కన్నింగ్ తెలివితేటలను అలవాటు చేసుకున్నారు.

కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ఈ ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ దసరా కానుకగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ప్రచారానికి వెళ్లిన ఈటల వర్గీయులను, కాషాయ కార్యకర్తలను కడిగిపారేస్తున్నారు. ధరలు పెంచి పేదల బతుకుల్లో మంటలు పెడుతున్న బీజేపీకి ఓటేయ్యం అంటూ ..మా ఇంటికి ఓట్లు అడగడానికి రావద్దు అంటూ బోర్డులు పెడుతున్నరు..దీంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు దిమ్మతిరిగి పోతుంది…అందుకు గ్యాస్ బండపై నోటికివచ్చిన అబద్ధాలు చెబుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నడు. ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు ఆడుతున్నడు.. అసలు గ్యాస్‌ సిలిండర్‌పై విధిస్తున్న జీఎస్టీ 5 శాతం…. ఇందులో కేంద్రానికి 2.5శాతం, రాష్ట్రానికి 2.5 శాతం చొప్పున వస్తుంది. దీని ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాటా రూ.20 మాత్రమే. ఈ వివరాలు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉన్నాయి. పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) ఈ ఏడాది మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్యాస్‌ సిలిండర్‌పై జీఎస్టీ మినహా బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీగానీ, ఎక్సైజ్‌ డ్యూటీగానీ విధించలేదని స్పష్టంచేసింది. అంటే ఇతర పన్నులేవీ లేవని స్వయంగా కేంద్రమే చెప్పింది.

అయినప్పటికీ, ఈటల రాజేందర్‌ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు పనిగట్టుకొని ఇలా గ్యాస్ బండపై రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 291 వస్తుంది…దాన్ని కేసీఆర్ తగ్గించుకుంటలేడు..ధర ఎట్ల తగ్గుతది అంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నడు..గతంలో ఆర్థిక శాఖమంత్రిగా చేసిన ఈటలకు గ్యాస్ బండ జీఎస్టీ పరిధిలో ఉన్నట్లు తెలియదా…రాష్ట్రవాటాగా కేవలం 20 రూపాయలు మాత్రమే వస్తున్నట్లు తెలియదా…తెలుసు..కాని హుజురాబాద్‌లో గెలుపు కోసం… కావాలనే ఇలా గ్యాస్ బండపై రాష్ట్ర ప్రభుత్వం వాటా 291 రూపాయలు వస్తున్నాయంటూ అబద్ధాలు ఆడుతూ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు…ఈటల చిల్లర రాజకీయంపై హుజురాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. గెలుపు కోసం ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడాలా ఛీఛీ.. అంటూ అసహ్యించుకుంటున్నరు. మొత్తంగా గ్యాస్ బండపై అబద్ధాలు ఆడి ఈటల రాజేందర్ అడ్డంగా బుక్కయ్యాడని హుజురాబాద్‌లో చర్చ జరుగుతోంది.