- Advertisement -
క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతామని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. Mnj క్యాన్సర్ ఆసుపత్రిలో pet ct scan ప్రారంభించి, హాస్పిటల్ లో వార్డు లు పరిశీలించారు ఈటెల రాజేందర్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన MNJ లో హై ఎండ్ పెట్ స్కాన్ ను ప్రజలకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే స్కాన్ బయట 25 వేలు అవుతుంది..క్యాన్సర్ ఏ ప్రాంతంలో ఉంది ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు అన్నారు.
లక్షల రూపాయలు ఖర్చు లేకుండా ఉచితంగా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చాలా ప్రేమతో పేషెంట్స్ ను చూసుకుంటున్నారని చెప్పారు. రూ. 40 కోట్లతో కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నాము. ఈ సంవత్సరం లో అందుబాటులోకి వస్తుందన్నారు. నాన్ కమ్యునికల్ డిసీజ్ ల వల్ల 60 శాతం మరణాలు జరుగుతున్నాయి. ఇది ప్రమాద కరం అయిన సూచిక అన్నారు.
- Advertisement -