హైదరాబాద్ దేశంలోనే గొప్ప నగరం- ఈటెల

375
Etela Rajender
- Advertisement -

ఈరోజు హైదరాబాద్ లో 41 వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిలసై సౌందర రాజన్, గెస్ట్ ఆఫ్ హానర్ గా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిలు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ హెల్త్ హబ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తరువాత ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకొని అనేక అంశాల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపగలిగినం. ఫోరెన్సిక్ మెడిసిన్ అనగానే పోస్టుమార్టం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ వీరు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోతే దోషులకు శిక్ష పడదు. శవాలు కుళ్ళిపోయిన కూడా శవ పరీక్ష చేయాల్సిందే అంత ఓపిక మన డాక్టర్స్ కి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని మార్చురీల్లో ఫ్రీజర్లు ఏర్పాటు చేస్తున్నాం. శవాలు కుల్లిపోకుందా చూస్తున్నాం. శవమే కదా అని వదిలివేయడం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందినా కొత్త సవాళ్ళు వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ ఇప్పుడు మనల్ని భయపెడుతుంది. కేరళలో ఒక విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నాము. ఇలాంటి కాన్ఫరెన్స్ లు కొత్తగా వస్తున్న సవాళ్లకు పరిష్కారం చూయించలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఈ కాన్ఫరెన్స్ జరగడం సంతోషం. హైదరాబాద్ లో దేశంలోనే మంచి వాతావరణం ఉంది. ఇది గొప్ప నగరం. ఈ వాతావరణం, ఫుడ్ ఎంజాయ్ చేయండి. కొత్త పద్ధతులకు, కొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువు కావాలని కోరుకుంటున్నానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -