అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యం: ఈటల

193
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ 2017-18ని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటల రాజేందర్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకువచ్చారు. సబ్‌ప్లాన్ల స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారాయన. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలనేదే వారు ప్రయత్నమన్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, తమ పై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఈటల రాజేందర్.

- Advertisement -