కొడంగల్‌లో రేవంత్ సోదరుడి అరాచకాలు:ఈటెల

5
- Advertisement -

రేవంత్ రెడ్డికి ఓటు వేసి కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు అయింది కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని ఈ దాడులు చేయించారు…సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి అన్నారు.

50 లక్షల రూపాయల విలువైన భూమిని 10 లక్షలు ఇచ్చి లాక్కోవాలని చూస్తున్నారు…144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు.. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ వేస్తాం అన్నారు. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు.. కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటి చెప్పాలన్నారు.

నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని…రైతుకు సంకెళ్లు, థర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు అన్నారు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు…అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఊరుకోం అన్నారు.

Also Read:బాధితులకు ఉరిశిక్షా..సత్యవతి రాథోడ్ ఫైర్!

- Advertisement -