నిరాదరణకు గురైన ఆయుర్వేదం…

300
etela rajender
- Advertisement -

ఆయుర్వేదం నిరాదరణకు గురైందని..కానీ ఓల్డ్ ఈజ్‌ గోల్డ్ అన్నట్లు మన భారత ప్రాచీన వైద్యానికి ఇప్పుడు మళ్ళీ ఆదరణ పెరిగిందన్నారు మంత్రి ఈటల రాజేందర్.హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో “విశ్వ మంగల్ దివస్”, “ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి హాజరయ్యారు ఈటల.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు.. మనిషి బ్రతికే కాలం పెరిగింది కానీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. అనారోగ్యం, టెన్షన్ రెండు మనిషిని పట్టి పీడిస్తున్నాయని… టెన్షన్ లేకుండా బ్రతికితే చాలు అనే స్థితికి మనిషి చేరుకున్నారని చెప్పారు.

గతంలో వరి అన్నం పేద వారికి అందుబాటులో ఉండేది కాదు కానీ ఇప్పుడు వరి అన్నం పేదవాళ్ళు తింటున్నారు, డబ్బున్న వాళ్ళు జొన్న గటక తాగుతున్నారు.అన్నీ ఉన్న తినలేని స్థితికి మనిషి చేరుకున్నాడు. దీనికి జీవన విధానంలో మార్పు రావాల్సిన ఉందన్నారు.

మన పాత సంస్కృతి గొప్పది అనే స్థితికి చేరుకున్నాం. ఆయుర్వేదానికి ఆదరణ పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.మూడు రోజులపాటు ఈ డిపార్ట్మెంట్లో సమస్యలు తీర్చేందుకు సమీక్ష నిర్వహించాను. ఆదరణ పెంచుతున్నానని చెప్పారు.

ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి,పాత భవనం మరమ్మతులకు నిధులు కేటాయిస్తం అన్నారు. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత లేకుండా చూస్తాం అని చెప్పారు.

జబ్బులకు డబ్బులతో పని లేదు.. పేదవాడి కైనా ఉన్నవారికైనా జబ్బులు వస్తున్నాయి.హాస్పిటల్ కి పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి మీద పడే భారం. అందుకే తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. స్వచ్ఛమైన గాలి కావాలని మనిషి కోరుకుంటున్నాడు దీనికి హరితహారం ద్వారా కేసీఆర్ గారు మార్గం చూపెట్టారు. నీళ్ల ద్వారా వచ్చే అంటువ్యాధులను అరికట్టేందుకు మిషన్ భగీరథ మార్గం అయ్యిందన్నారు. విజ్ఞాన తెలంగాణ ,ఆరోగ్య తెలంగాణ కలిస్తేనే బంగారు తెలంగాణ అవుతుంది అని నమ్మి పని చేస్తున్నామని తెలిపిన ఈటల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్ గా పనిచేసిన వెంకటాచారి గారికి ధన్వంతరి అవార్డు రావడం ఈ రోజు ఆయనను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -