భాగ్యనగరం బస్తీ దావాఖానాలతో మురిసిపోయింది. వందలాది పేద బస్తీల ముంగిల్లకే ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. పేదవారికి ఉచితంగా నాణ్యంగా వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వచ్చిన తరువాత ప్రభుత్వం బస్తీ దావాఖానాలకు శ్రీకారం చుట్టింది.ఇప్పటికే 122 బస్తీ దావాఖానాలు పనిచేస్తుండగా ఈ రోజు మరో 44 ప్రారంభించుకున్నం.ఈ నెలాఖరుకు ఇంకో 30 సిద్ధం అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉప్పల్‌లో మూడు, బంజారాహిల్స్‌లో రెండు సెంటర్లు ఈ రోజు తాను ప్రారంభించామని తెలిపారు.
పేదలు ప్రైవేట్ వైద్యం మీద ఆధారపడకుండా ఉండేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నమ్మకం, విశ్వాసం పెంచుతున్నాం అని అన్నారు. బస్తీ దావాఖానలో స్క్రీనింగ్‌తో పాటు మందులు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ పరీక్షలు చేయడానికి అవకాశం లేకపోయినా శాంపిల్స్ తీసి ఐపీఎం కి పంపి టెస్ట్‌లు చేయిస్తామన్నారు. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇవి రిఫరల్ సెంటర్స్ గా పని చేస్తాయని మంత్రి తెలిపారు. బస్తీ వాసులు వీటిని వాడుకొని వైద్య ఆరోగ్య శాఖకు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.