వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు..

271
Etela Rajender Emotional Speech In Assembly
- Advertisement -

రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. బడ్జెట్ పై వివరణ ఇచ్చిన ఈటెల…తెలంగాణ సంక్షేమ పథకాలను యావత్ భారతం కొనియాడుతోందన్నారు. ప్రతి బడ్జెట్‌లో 95 శాతం ఖర్చు చేశామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపని జోస్యం చెప్పారు.

వ్యవసాయ వృద్ధి రేటు 16.8 శాతంగా ఉందన్నారు.అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలకు అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం కృషి వల్ల వ్యవసాయం,ఐటీ రంగాల్లో వృద్ధి సాధించామన్నారు. ప్రభుత్వం మానవీయ విలువలతో పనిచేస్తోందన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో అప్పులు చేశారని…కానీ తమ ప్రభుత్వమే అప్పులు చేసినట్లు కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అప్పు చేయడం తప్పా? అని ప్రశ్నించారు ఈటల. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతోనే అప్పులు చేశామని కానీ ఎలాంటి సాయం అందలేదన్నారు.

ప్రతిపక్షాలు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం,వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పడం బాధాకరమని ఈటల అన్నారు.

కొత్త రాష్ట్రమైనప్పటికీ అనేక రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు.. తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రులు ప్రభుత్వ పని విధానాన్ని కొనియాడారని తెలిపారు.

- Advertisement -