‘హైడ్రా’ ప్రజలను వేధించే సంస్థ!

2
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హైడ్రా’ వ్యవస్థపై మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా అనేది ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ, వేధింపులకు గురిచేసే ఒక సంస్థగా మారిందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఈటల తీవ్రంగా మండిపడ్డారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను స్థాపించామని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఆనాడు హిట్లర్ ప్రజలను ఎలాగైతే వేధించాడో నేడు రేవంత్ రెడ్డి కూడా హైడ్రా ద్వారా తెలంగాణ ప్రజలను అదే రీతిలో వేధిస్తున్నారు అని విమర్శించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..కూల్చివేతలకు అధికారం లేదు: ప్రభుత్వానికి అధికారులను నియమించుకునే విచక్షణాధికారం ఉండవచ్చు కానీ, పేదల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేసే అధికారం ఎంతమాత్రం లేదు. హైడ్రా అనేది కేవలం పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసే సంస్థగా మారిందని ప్రజలే నిర్ధారించుకున్నారని పేర్కొన్నారు.

తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టడానికి, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని భయపెట్టి బ్లాక్‌మైల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.హైదరాబాద్ నగరంలో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కూల్చివేతలను చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, చివరకు ఇల్లు కొనుగోలు చేయాలన్నా భయపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తక్షణమే ఆపాలని, లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఈటల హెచ్చరించారు.

Also Read:అద్దంకి, సామాకు హరీశ్ లీగల్ నోటీసులు

- Advertisement -