హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల గెలుపు..

124
- Advertisement -

హుజురాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24,068 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. 22వ రౌండ్‌లో బీజేపీకి 4481 ఓట్లు రాగా టీఆర్ఎస్ 3351 ఓట్లు సాధించింది. దీంతో ఈటల రాజేందర్ 1,130 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా ఈటల రాజేందర్‌కు 106780 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 3012 ఓట్లు పడ్డాయి. కాగా ఈటల రాజేందర్ 2004 నుంచి వరుసగా 7సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -