ఆదివాసిలకు అండగా ఎస్సీ,ఎస్టీ కమిషన్

575
errolla srinivas
- Advertisement -

ఆదివాసిలకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉందని తెలిపారు ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల మారుమూల చెంచు పెంటల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి పర్యటించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్.

కరోన ఉన్న నేపథ్యంలో చెంచుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సమగ్రంగా గిరిజనులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.

గిరిజనుల స్థితిగతులను మార్చేలా త్వరలోనే ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం అన్నారు. వైద్య సేవలు మరింత మెరుగు పరిచే లా 108 అంబులెన్సులు ఏర్పాటు చేస్తాం అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

- Advertisement -