కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్‌:ఎర్రోళ్ల

7
- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్ కు వయసు పెరిగింది తప్ప బుద్ది పెరగలేదు అని మండిపడ్డారు ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మీడియాతో మాట్లాడిన ఎర్రోళ్ల….మాటకు కేసీఆర్ ను కే టీ ఆర్ ,హరీష్ రావు లపై బురద జల్లడం తప్ప పొన్నం చేస్తున్నదేమి లేదు ..అవినీతికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ అన్నారు. కలెక్షన్ సెంటర్ల గురించి పొన్నం మాట్లాడటమా ?,రవాణా శాఖలో అవినీతి లేదని పొన్నం శ్వేత పత్రం ఇవ్వగలడా అని ప్రశ్నించారు.

కరప్షన్ ,కలెక్షన్ కాంగ్రెస్ విధానం అని,..కేసీఆర్ హాయం లో ఒక్క బస్సు కొనలేదని పొన్నం అంటున్నారు,..డిసెంబర్ 7 న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ..ఆ వెంటనే బస్సులు ప్రారంభించారు అన్నారు. అంత తక్కువ వ్యవధిలో బస్సులు మీరు కొనడం ఎలా సాధ్యం ..కేసీఆర్ హాయం లో బస్సులు ఎన్ని కొన్నారో సజ్జనార్ ను పొన్నం అడిగితే చెబుతారు అన్నారు. కేసీఆర్ హయం లో వేల బస్సులు కొన్నాం …500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలు ఓలెక్ట ,జేబీఎం సంస్థలకు ధారాదత్తం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.

కొన్ని డిపో లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిందని..ఆర్టీసీ కి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందా ?..ఆర్టీసీ లో కలెక్షన్ల దందా నడుస్తోందన్నారు….ఆర్టీసీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం లో భారీ గా అవినీతి జరిగింది ..దీనిపై సీబీసీఐడీ దర్యాప్తునకు సిద్ధమా ?..లాభాల్లో ఉన్న ఆర్టీసీ ని నష్టాల్లోకి నెట్టారు ..ఆర్టీసీ ని మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే 2100 కోట్ల రూపాయల నష్టానికి చేర్చారు..మా మీద ఆరోపణలు చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడమే ..పొన్నం రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి పై సోనియా కు పిర్యాదులు వెళ్లాయి.సీఎం పీ ఏ ట్రాన్స్ పోర్టు శాఖ లో దందాలు చేస్తున్నారు ..దీనిపై పొన్నం విచారణ కు సిద్ధమా ?..ఏఐసీసీ అంటే అల్ ఇండియా కరప్షన్ కమిటీ ..పొన్నం ప్రభాకర్ పుచ్చి విమర్శలూ మాని తన శాఖ మీద దృష్టి పెడితే మంచిదన్నారు.

ALso Read:హరీష్‌ను విమర్శించే అర్హత పొన్నంకు లేదు!

- Advertisement -