చంద్రబాబు దర్శకత్వంలో సీఎం రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రోళ్ల..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం అన్ని పదవులు అనుభవించారు… ఒక ముఖ్యమంత్రి పదవి మాత్రమే రాలేదు. రాజకీయం అంటేనే ఒక రైలు డబ్బాలాంటిందన్నారు.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు ఎర్రోళ్ల. పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అని రేవంత్ అన్నారు… పదవులకు రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అన్నారు…ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు.
తెలంగాణలో తెలుగు దేశం మాస్కు వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని…రాష్ట్రంలో జరుగుతుంది రాజకీయ పునరేకీకరణ కాదు. పాత తెలుగు తమ్ముళ్ల పునరేకీకరణ.. వారంతా ఒక వేదిక మీదకు వస్తున్నారన్నారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..