కాంగ్రెస్ డిక్లరేషన్లు..డెత్ డిక్లరేషన్లు!

10
- Advertisement -

కాంగ్రెస్ డిక్లరేషన్లు డెత్ డిక్లరేషన్లుగా మారాయి అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రోళ్ల..మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా చేవెళ్లలో విడుదల చేసిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు అన్నారు.

గాంధీ భవన్ లో రేవంత్ రూపంలో గాడ్సే చొరబడ్డాడు అన్నారు బాలరాజు యాదవ్. రేవంత్ పాలనలో జై భీం, జై బాపు, జై సంవిధాన్ వట్టి నినాదాలుగా మాత్రమే మారిపోయాయి… బీజేపీ స్కూల్, టీడీపీ కాలేజీ అంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎలా న్యాయం చేస్తాడు? చెప్పాలన్నారు.

Also Read:హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

రేవంత్ రెడ్డి 60 వేల ఉద్యోగాలు ఇస్తే.. నిరుద్యోగులు సెక్రటేరియట్ ను ఎందుకు ముట్టడించారు?, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అమలు చేయలేదు అన్నారు వాసుదేవ రెడ్డి. రేవంత్ రెడ్డి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేది వట్టి బోగస్ అన్నారు.

- Advertisement -