తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని నియామకాల్లో అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్లపై ఈ రోజు బషీర్ బాగ్‌లో కమీషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్ష సమావేశానికి కమిషన్ సభ్యులు శ్రీమతి నీలాదేవి పెందూర్,రాంబాల్ నాయక్,దేవయ్య,విద్యాసాగర్,నర్సింహ తదితరులతో పాటు కమీషన్ సెక్రటరీ కరుణాకర్,అన్ని విశ్వవిద్యాలయాల రిజస్ట్రార్లు హాజరయ్యారు.ఈ సమావేశంలో కింద పేర్కోన్న అంశాల గురించి కమీషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ రిజస్ట్రార్లతో సుదీర్ఘమైన సమీక్ష సమావేశం నిర్వహించారు.
1. ప్రమోషన్ మరియు ప్రత్యక్ష నియామకంలో రిజర్వేషన్ నిబంధన అమలు యొక్క స్థితి ఏమిటి?
2. ప్రారంభం నుండి కేటగిరీల వారీగా చేసిన నియామకాల సంఖ్య ఎంత?
3. ప్రొఫెసర్ పోస్టులతో సహా అన్ని రకాల నియామకాలు మరియు పదోన్నతులు రెండింటిలోనూ ROR అమలుకు సంబంధించిన అన్ని నియమాలు పాటించారా?
4. బోధన మరియు బోధనేతర సిబ్బంది రెండింటి యొక్క కేటగిరీ ల వారీగా ఖాళీల సంఖ్య ఎంత?
5. అన్ని పోస్టులలో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేశారా? మరియు బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలో విధానం ఏమిటి?
6. బోధన మరియు బోధనేతర సిబ్బందికి ROR రిజిస్టర్లు నిర్వహించబడుతున్నాయా?
7. ప్రొఫెసర్ పోస్టులతో సహా అన్ని కేటగిరిలలో ప్రత్యక్ష నియామకాల కింద పోస్టులను భర్తీ చేయడానికి సంక్షేమ శాఖల సమ్మతి తీసుకుంటున్నారా?
8. విశ్వవిద్యాలయాలతో సహా అన్ని సంస్థలు చేపట్టే అన్ని నియామకాలు మరియు అన్ని కేటగిరి లలో రిజర్వేషన్ల నియమాన్ని(ROR) పాటించాలని Act 24 of 1977 స్పష్టంగా చెబుతుంది.
విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిబంధనను నిర్లక్ష్యంగా ఉల్లంఘించినట్టు సమాచారం లాంటి ఇలా పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల నియామకాల్లో, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు యొక్క స్థితిగతులపై వివరించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ,బ్యాక్ లాగ్ పోస్టుల, బోధన మరియు బోధనేతర సిబ్బంధి నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలను,ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే క్రమంలో కమిషన్ చొరవ చూపుతుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుల్లో కూడా దేశానికి ఆదర్శంగా నిలిచేలా రిజస్ట్రార్లు చొరవ చూపాలని కమిషన్ చైర్మన్ కోరారు.