- Advertisement -
దళిత సమాజం దేవన్న సేవలు ఎప్పటికి మరిచిపోదన్నారు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్. తొలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, దళిత ఉద్యమ నేత సుంకపాక దేవయ్య ఇవాళ ఉదయం తన స్వగృహంలో మృతిచెందారు.
ఈ సందర్భంగా ఆయనకు కమిషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులు విద్యాసాగర్, రాంబల్ నాయక్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ సుంకపాక దేవయ్య సేవలను గుర్తుచేసున్నారు ఎర్రోళ్ల.
దళిత సమాజం ఆయన సేవలను ఎన్నటికీ మరువదని, తెలంగాణ దళితుల హృదయాల్లో దేవన్న చిరస్థాయిగా నిలుస్తారని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -