42శాతం రిజర్వేషన్లు..ఓ డ్రామా:ఎర్రబెల్లి

9
- Advertisement -

కాంగ్రెస్‌ 420 హమీల్లానే ఈ 42 శాతం బిసి రిజర్వేషన్లు డ్రామా.. ఈ లిల్లీఫుట్‌ ముఖ్యమంత్రికి పాలన తెలియదు. అసలు అవగాహన లేదు.. మంత్రులు కూడా అట్లానే ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. కోర్టును గౌరవించకుండా పొద్దుగాల నామినేషన్లు తీసుకొని సాయంత్రం నవ్వుల పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వానిది అన్నారు.

మీ తుపాకి రాముని కథలు ప్రజలకు అర్ధం అయినాయి… పొద్దుగాల లేస్తే కేసీఆర్‌ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు తప్పా ఈ లిల్లీఫుట్‌ ముఖ్యమంత్రికి ఏం తెలియదు.ఈ బ్రొకర్‌ మాటలు గతంలో ప్రజలు నమ్మారు కాని కోర్టులు నమ్మలేదు కాబట్టే హైకోర్టు గూబ గూయ్యిమనిపించింది. రాష్ట్రంలో కనీసం ఇద్దరు మంత్రులు కలిసి తిరిగే పరిస్థితి లేదు. ఎవరి కుర్చీ ఎవరు లాక్కుంటారనే భయంతో ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా నియోజకవర్గంలో తిరగడం లేదు అన్నారు.

ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకొలేక కొత్త డ్రామాకి తెరలేపిన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికలు నిర్వహించలేకనే ఏదో కోర్టు ఆపింది మేము బిసిల కోసం అన్ని చేశాం అని చెప్పుకోవాలని కాంగ్రేస్‌ కుట్ర పన్నింది..55 ఏండ్లు కాంగ్రేస్‌ కేంద్రంలో అధికారంలో ఉండి బిసిల గురించి ఎందుకు పట్టించుకోలేదు ?, తూతూ మంత్రంగా జివో ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకనే ఇదంతా డ్రామా…నిజంగా బిసిల పట్ల ప్రేమ ఉంటే రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడండి. దానికి మేమంతా కలిసి వస్తాం అన్నారు. అయినా ఈ రేవంత్‌రెడ్డికి బిసిల పట్ల ప్రేమ ఉంటే నిలవదు అని తెలిసిన కూడా జివో ఇచ్చెవాడా ?,ఈ ప్రభుత్వం 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి బిసిలకి ఏం చేసింది ?,బిసి బంధు బందు పెట్టింది, చేప పిల్లల పంపిణీ బందు పెట్టింది, నాయి బ్రాహ్మణ, రజకుల ఉచిత విద్యుత్‌ బకాయిలు పెండిరగ్‌లో పెట్టింది. గొల్లకురుమలకు గొర్రెలు బందు పెట్టి ఇంకా ఏదో బిసిల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది అన్నారు.

ఆనాడు ఈ రేవంత్‌రెడ్డి గారు ఏమన్నారు. అసలు రాష్ట్రాలకి రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం నేరం అడుగితే జైల్లో పెట్టాలన్న ఈ రేవంత్‌రెడ్డిని మరి ఇప్పుడు ఏ జైల్లో పెట్టాలి… 42 శాతం బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందకుండా ఎన్నికలకు పోవటమే ఒక తెలివి తక్కువ పని.. ఈ రిజర్వేషన్‌ ప్రక్రియ సరిగా అమలుకాకనే బిహర్‌ లో ఎన్నికలు ఆగిపోయాయి, మహరాష్ట్రలో ఎన్నికలు జరిగినా 18 రోజుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మాత్రం సోయి ప్రభుత్వానికి లేదా ? ,అయినా కూడా ఈ రిజర్వేషన్‌ చట్టం ఆమోదం పొందకుండా ఎన్నికలు నిర్వహించి, మళ్లీ ఆ ఎన్నికలు రద్దు అయితే నష్టపోయేది బిసి బిడ్డలు కాదా ?,అంటే బిసిలను ఆర్ధికంగా నష్టపరచడమే మీ ప్రభుత్వ ధ్యేయమా ?.. ఈ కాంగ్రెస్‌ అసమర్ధ పాలన వల్ల గ్రామాలు అన్ని వెనకబడి పోతున్నాయి…22 నెలల పాలనలో గ్రామ పంచాయితీలకు ఈ ప్రభుత్వం ఒరగ బెట్టింది ఏం లేదు..ఆనాడు కేసీఆర్‌ గారు గ్రామాలు బాగుపడతేనే రాష్ట్రం బాగుంటుందని గ్రామ పంచాయితీలకు అధిక నిధుల ఇచ్చి అభివృద్ది చేస్తే… ఈ ప్రభుత్వం ఆ గ్రామాల అభివృద్దికి అడ్డుగా నిలిచి గ్రామాలు ఆధ్వాన్న స్థితిలోకి వచ్చాయి అన్నారు.

ఆనాడు అసెంబ్లీలోనే కేటిఆర్‌ గారు ఈ 42 శాతం బిల్లుపై ఎలా ముందుకు వెళ్తారు అని అడిగితే సమాధానం చెప్పలేక.ఇన్ని రోజులు కాలయాపన చేసి మేము బిసిల కోసం అన్ని చేసాం. కోర్టు ఆపింది ఆని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా?..ఈ జివో నిలబడదు అని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ బిసిలను మభ్యపెట్టడానికే ఈ పనికి మాలిన పనులు చేసింది..అభివృద్ది చేతగాక ఈ ప్రభుత్వం అమ్మకాలకు తెరలేపి ఆర్టీసీని సైతం ప్రైవేటికరణ చేసే కుట్ర జరుగుతుంది..మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 13 వందల 50 కోట్ల అప్పు చేసి ఆ అప్పును బస్సు చార్జీలు పెంచి ఆ కుటుంబంలోని మగవారిపై రుద్దుతున్నారు అన్నారు.

Also Read:జక్కన్నకు మహేష్ స్పెషల్ విషెస్

- Advertisement -