కార్మికుడికి ప్రతి నెలా 5వేల పెన్షన్

151
- Advertisement -

చలికాలంలో మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచేసింది. పార్టీలన్నీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. మునుగోడు నియోజకవర్గం చండూరు లో జరిగిన ఉప్పరి (భవన నిర్మాణ) కార్మికుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

ఈ సదర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారు కార్మిక పక్షపాతి.. కార్మికులకు ఒక్క తెలంగాణ లోనే ఎక్కువ న్యాయం జరుగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కార్మికులను పట్టించుకోవడం లేదని.. అందుకే వాళ్లంతా తెలంగాణకు వలస వస్తున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు స్థానికంగా పరిష్కారం అయ్యేవి. స్థానికంగానే పరిష్కరించుదాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కార్మిక భవనం ఏర్పాటు చేద్దాం . పేదల కోసం బాగా ఆలోచించే గొప్ప వ్యక్తి సీఎం కెసిఆర్ అని అన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు షెడ్లు నిర్మింప చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఆధునిక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి కార్మికుడు తప్పని సరిగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి ప్రతి నెలా 5వేల పెన్షన్.  చనిపోయే వరకు భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు.. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవనం నిర్మిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు చదువు ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఆగిపోయిన డెత్ క్లైమ్స్ ను వెంటనే ఇప్పించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఇచ్చే భృతిని ఇంకా పెంచే డిమాండ్ల ను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేలా చేస్తానని అన్నారు మంత్రి ఎర్రబెల్లి.

ఇవి కూడా చదవండి

ఓఆర్ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ మారింది

నటుడు అలీకి కీలక పదవి

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

- Advertisement -