సర్కార్ బడులను ప్రైవేట్‌కి ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్నారు.
సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని… తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు. సీఎం చొరవతో ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు మంచి విద్య అందించడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకు రాగి జావా అందిస్తున్నామని చెప్పారు.
మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు. నీటి వసతి, టాయిలెట్స్, తరగతి గదులు, మధ్యాహ్నం అందిస్తున్న జావా, చదువు, స్కూల్ ఆవరణలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Also Read:హిమాలయాలకు రజినీ..జైలర్ పరిస్థితేంటి?