వరద ప్రభావిత ప్రాంతాలకు మంత్రులు

112
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.హనుమకొండ జిల్లా గ్రేటర్‌ వరంగల్ పరిధిలోని జవహర్‌కాలనీ, గుండ్ల సింగారం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటించారు.

వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని…. నీట మునిగిన కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వారికి ఆహారం, మంచినీటి బాటిళ్లు అందించామని తెలిపారు. వరంగల్ వరదలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు.

Also Read:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాజర్

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో పర్యటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయింది. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు.

Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?

- Advertisement -