ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే… బిజెపి దిగజారుడు రాజకీయాలేంటి?అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వరంగల్ కి ఉద్దేశ పూర్వకంగానే వచ్చి, వివాదాలు సృష్టించారు….ఆయన ఎంపీ అన్న విషయం కూడా మరచి మాట్లాడుతున్నారు..మా పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు…కార్యకర్తలను ఉసి గొల్పి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు….రాజకీయ మైలేజీకే ఈ తమ పదవులను, పార్టీని వాడుకుంటున్నారని అరవింద్‌ని విమర్శించారు.ఇది రాజకీయాలు చేసే సమయమా? ప‌్రజలను ఆదుకునే సమయమా?ఎవరి శ్రేయుస్సు కోసం ఈ రాద్ధాంతాలు? బిజెపి సిద్ధాంతాలు ఇవేనా? మీ ప్రవర్తన ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు?రాజకీయాల్లో ఉన్న వారు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయంపై బిజెపి దాడి అప్రజాస్వామికం…అరవింద్ మాటల్ని, మా మాజీ ఎంపీ కవిత, మా వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యల్ని, ఆయన తీరుని ఖండిస్తున్నానని తెలిపారు. కవిత,వినయ్ భాస్కర్,నన్నపనేనిపై చేసిన వ్యాఖ్యల్ని భేషరతుగా విరమించుకోవాలి. క్షమాపణలు చెప్పాలి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
నిజామాబాద్‌లో అరవింద్ ఎలా గెలిచారో ప్రజలకు తెలియదా?రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ప్రవర్తనే గౌరవ ప్రదంగా ఉండాలి..పెద్దవాళ్ళని విమర్శిస్తే రాజకీయాల్లో పెద్దై పోరు నిత్యం జవాబుదారీగా, అందుబాటులో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను విమర్శిస్తే కాదు ..ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు…ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలి ప్రజలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో, టిఆర్ఎస్ నే ఎందుకు ఆదరిస్తున్నారో గుర్తించండి అని తెలిపారు.
తాము కూడా మీలాగే ప్రవర్తిస్తే పరిస్థితిని ఒక్క సారి ఊహించుకోండి కానీ మా అధినేత అభిమతం అదికాదు.ఎంత ఎదిగితే, అంత ఒదిగి ఉండాలనేది మా అధినాయకుడు, సీఎం కెసిఆర్ గారి లక్ష్యం …ఇలాంటి ప్రేరేపణలు, ప్రేలాపణలకు మేం తలొగ్గం. రెచ్చగొడితే… రెచ్చిపోం..ఇలాంటి సమయాల్లో సంయమనంగా ఉండాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు ఎర్రబెల్లి.ఎవరెన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా…14 ఏళ్ళు శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చిన ఘనత, త్యాగాల చరిత మా సిఎం కెసిఆర్‌ది…ప్రజలపై అపారమైన నమ్మకంతో, ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఉన్నాం అని వెల్లడించారు.