త్వ‌ర‌లో గ్రామాల‌కు మ‌హ‌ర్ద‌శ‌: మంత్రి ఎర్రబెల్లి

285
errabelli dayakarrao
- Advertisement -

సిఎం కెసిఆర్ ప‌ల్లెల ప్ర‌గ‌తికి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని, అందుకే పంచాయ‌తీరాజ్ శాఖ‌కు భారీగా నిధులు కేటాయించార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ్రామాల‌కు మ‌హ‌ర్ద‌శ రానున్న‌దని, ఈ నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో సిసి రోడ్ల‌ను పూర్తి చేయాల‌ని, ఇది సిఎం కెసిఆర్ గారి ఆదేశ‌మ‌ని మంత్రి చెప్పారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం పాల‌కుర్తిలో, దేరుప్పుల‌లో సోమవారం పలు సిసి రోడ్లకు శంకుస్థాపన, కొన్ని రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణనీటి సరఫరా, పల్లె ప్రగతి వంటి పలు అంశాలపై సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు 23,005 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయించార‌న్నారు. సిసి రోడ్ల‌కు 600 కోట్లు కేటాయించార‌ని అన్నారు. ప‌ల్లె ప్ర‌గతి కోసం ప్ర‌త్యేకంగా నిధులు ఇచ్చార‌న్నారు. ప‌ల్లెల అభివృద్ధికి ఇంత‌గా పాటుప‌డ్డ ముఖ్య‌మంత్రి గ‌తంలో లేర‌న్నారు. ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాలు, బాగోగులు తెలిసిన ముఖ్య‌మంత్రి కాబ‌ట్టే, ప‌ల్లెల‌కు సైతం అవ‌స‌ర‌మైన నిధులు వ‌స్తున్నాయ‌న్నారు.

ఇప్ప‌టికే ప‌ల్లె ప్ర‌గ‌తి కింద మంజూరైన‌, ఇత‌రత్రా గ్రౌండ్ అయిన సిసి రోడ్ల‌న్నింటినీ ఈ నెలాఖ‌రు లోగా పూర్తి చేయాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశించార‌ని మంత్రి తెలిపారు. సిఎం గారి ఆదేశానుసారం మార్చి 31లోగా ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని సూచించారు.అలాగే, స్థానిక సంస్థ‌ల అధికారాలు, నిధులు, విధులు, బాధ్య‌త‌ల విష‌యంలోనూ సీఎం కెసిఆర్ ద్రుఢ నిశ్చ‌యంతో ఉన్నార‌న్నారు. త్వ‌ర‌లోనే జెడ్పీ చైర్మ‌న్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లకు సంబంధించిన అన్ని విష‌యాల‌ను సిఎం ప‌రిష్క‌రిస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -