- Advertisement -
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో నేతల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు రూపొందించామన్నారు.
రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని …ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ఆరంభించారని చెప్పారు.
- Advertisement -