బీజేపీ అబద్ధపు ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్నది..

130
Errabelli Dayakar Rao
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం మీర్‌పేట్ డివిజన్‌లో భరత్ ఫంక్షన్ హాలులో జరిగిన ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశమైయ్యారు. ఈ డివిజన్ ఇంచార్జీ, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి మీర్‌పేట్ డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. డివిజన్ పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే, మీర్‌పేట డివిజన్‌లో బూత్ ఇంచార్జీలతోను సమావేశమై, వాళ్లకు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు మంత్రి.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ అబద్ధపు ప్రచారాలతో ప్రజల్ని మోసం చేస్తున్నది. మాయోపాయాలు పన్నుతున్నది. జనం సెంటిమెంట్స్ ని రెచ్చ గొట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నదన్నారు. బీజేపీ వల్ల దేశం, రాష్ట్రం నష్టపోతున్న విషయం ప్రజలు గుర్తించాలి. పన్నులు సహా, మనకు రావాల్సిన నిధులను బీజేపీ అధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అయినా సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో హైదరాబాద్ విశ్వ నగరంగా రూపు దిద్దుకుంది. అభివృద్ధిని కొనసాగించాలనే, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీర్ పేట డివిజన్‌లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. మీర్ పేటతో పాటు మరో 6 డివిజన్లను సమన్వయం చేసుకోవాలని మంత్రి తెలిపారు.

కార్పొరేటర్ గా అవకాశం ఎవరికి వచ్చినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి. రూ.110 కోట్లతో ఒక్క మీర్ పేట డివిజన్ అభివృద్ధి జరిగింది అంటే, అది సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ ల చలవ.సికింద్రాబాద్ ఎంపీగా ప్రతిసారీ బీజేపీ గెలుస్తుంది. మరి రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పమని, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నిలదీయండి. వాళ్లు రెచ్చగొట్టి, చిచ్చు పెట్టే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి పార్టీలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నాను. బీజేపీ ఎంపీలు ఏమి తేచ్చారో చెప్పండి. దేవుని మీద నమ్మకం ఉంటే, మీరు ఒట్టేసి చెప్పండి, వరద సాయం ఆపమని ఎన్నికల సంఘానికి మీరు కొరలేదా..అబద్ధపు ప్రచారాలు మానుకోండి అని మంత్రి విమర్శించారు. ఈ ఎన్నికల్లో అవలీలగా జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానాన్ని మేము గెలుస్తాం. మీర్ పేట డివిజన్‌ను నేను దత్తత తీసుకుంటాను. సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో ఈ డివిజన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. బూత్ ల వారీగా బాధ్యులు ఉంటారు. వాళ్ళకి సహకరించండి. ఇప్పటికే విశ్వ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో ఉప్పల్ నియోజకవర్గం కీలకంగా పని చేసింది. అప్పట్లో మంత్రులను నిలదీసిన ఘనత ఈ డివిజన్ల కు ఉంది. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ డివిజన్ లో జరిగింది. మల్లా పూర్ చౌరస్తాను ఆధునికంగా మార్చినం. అప్పటి, ఇప్పటి అభివృద్ధిని చూడండి. నిన్నటి వరద బాధితులను అడుకున్నది ఎవరు? మన ప్రభుత్వం కాదా.. ఇంటి పన్నులను 50శాతానికి తగ్గించిన సంగతి తెలుసు.. 20, 30 ఏండ్లల్లో జరగని అభివృద్ధి, కొద్ది రోజుల్లోనే చేసుకున్నాం..దయన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపే. అందరం కలిసి కట్టుగా పని చేసి, ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే కోరారు.

- Advertisement -