ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలవాలి- మంత్రి ఎర్రబెల్లి

191
minister errabelli
- Advertisement -

శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మై హోమ్స్ ఇండస్ట్రీస్ లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా సిమెంట్స్ సౌజన్యంతో, భక్తి నివేదన ఆధ్యాత్మిక పత్రిక సమర్పణలో.. ప్లవ నామ సంవత్సర క్యాలెండర్, పంచాంగాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.

కళ్యాణ మహోత్సవం అనంతరం, జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో అయా శాఖల అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి గ్రామం దేశానికి ఆదర్శం కావాలే.. అవార్డులు, రివార్డులకు అతీతంగా అభివృద్ధి జరగాలే అని అన్నారు. గ్రామాల్లో కరోనా ఉధృతి ఎలా ఉంది? నివారణ, ప్రజా చైతన్య కార్యక్రమాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

సామాజిక, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని, సామాజిక, సామూహిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని సూచించారు. నర్సరీలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తేవాలని అధికారులకు సూచించారు ఈ వేసవి కారణంగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచినీరు అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రతి అవార్డు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు.అవార్డులు వచ్చిన గ్రామాలను స్ఫూర్తి గా తీసుకోవాలని మంత్రి సూచించారు.

- Advertisement -