బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు..

135
minister errabelli
- Advertisement -

100 స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొర్రూరు మండలం అమ్మాపురంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. పుస్తకాలు మనకు జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా నేర్పుతాయన్నారు. సీఎం కేసీఆర్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. వారు పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానంతో ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ అవిరళమైన కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు.

మనం ఎంత సంపాదించినా మన వెంట తీసుకుపోలేము. మన సంపాదించే, ఖర్చు విషయంలో ఆలోచనా ధోరణి మారాలి. సంపాదించిన దాంట్లో కొంత సేవకు కేటాయించాలి. సేవ చేయడం వల్ల మనస్సుకు నిజమైన తృప్తి కలుగుతుందన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నేను కూడా నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశాను. రెండు అంబులెన్స్ లు ఇచ్చాను.అలా పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువత కూడా సంఘ సేవ చేయడానికి ముందుకు రావాలి. అమ్మాపురం గ్రామంలో యువత, విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేయడం సంతోషకరం. ఈ లైబ్రరీ ఏర్పాటు చేసిన 100 స్మైల్ ఫౌండేషన్ వారిని అభినందిస్తున్నాను అని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -