సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి: ఎర్రబెల్లి

316
Errabelli Dayakar Rao

మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ హైస్కూల్లో లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు, కల్యాణ లక్ష్మి,షాదీబుబారక్ చెక్కులను అందజేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందని. రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శం నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు వరంగా మరిందని మంత్రి తెలిపారు. నూతన రెవెన్యూ చట్టంతో భూ సమస్యలు సమూలంగా పరిష్కారం అవుతాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు.