- Advertisement -
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో కలిసి కోలాటమాడారు. ఆయన ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని జెడ్పి హై స్కూల్‌లో మరియు వెలికట్ట గ్రామంలో, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో హాజరైయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం అందచేస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలతో కలిసి సరదాగా ఆయన ఆడిపాడారు.
- Advertisement -