బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు..

81
- Advertisement -

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల నరోత్తం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Also Read:‘భోళా శంకర్’.. డబ్బింగ్ పూర్తి

సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జహీరాబాద్ నియోజకవర్గ మేలుకోసం బీఆర్ఎస్ పార్టీలో చేరానని నరోత్తం చెప్పారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వారి మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

Also Read:ఎగరలేని పక్షులివే

- Advertisement -