టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగాన్‌

37
- Advertisement -

టర్కి అధ్యక్షుడిగా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు ఎర్డోగాన్, రెండు దశాబ్దాలుగా టర్కీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎర్డోగాన్ తాజా ఎన్నికల్లో 52 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి కెమల్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఎర్డోగాన్ విజయం సాధించారుఉ.

మరో ఐదేండ్లపాటు తనకు అధ్యక్ష పదవి అప్పగించినందుకు ఎర్డోగాన్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తాంబుల్‌లోని ఇంటి వెలుపల తన మద్దతుదారులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టర్కీ విజయం సాధించిందని…తాను 21 సంవత్సరాలుగా మీ నమ్మకానికి అర్హుడినని చెప్పారు.

Also Read:IMD:రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు

దేశంలో అధిక ద్రవ్యోల్బణం, భారీ భూకంపం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించడం విశేషం. ఫిబ్రవరి నెలలో వచ్చిన భూకంపం సమయంలో ఎర్డోగాన్‌ ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటిని తట్టుకుని విజయం సాధించారు ఎర్డోగాన్.

Also Read:ఆమిర్ మూడో పెళ్లి..రాఖీ కామెంట్స్‌..!

- Advertisement -